శేరిలింగంపల్లి, నిలువుటద్దం ప్రతినిధి:
సాహితీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. 2018లో కార్యాలయ స్థలం కొనుగోలు కోసం తన బ్యాంకు ఖాతా నుంచి సంస్థకు రూ.2.1 కోట్లు చెల్లించానని, స్థలం కేటాయించకపోవడంతో అదే మొత్తం తిరిగి తన ఖాతాలో జమ అయిందని తెలిపారు. లావాదేవీలన్నీ బ్యాంకింగ్ మార్గంలోనే జరిగాయని, సంబంధిత రికార్డులు, ఆధారాలను విచారణలో సమర్పిస్తానన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని గాంధీ కోరారు.
Post Views: 15









