తెలంగాణ బ్యూరో ,నిలువుటద్దం ;
రూ.80 నుండి రూ.100 వరకు విక్రయం – తూకంలో మోసాలు
ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు వాటిని బాగు చేసి పాలిష్ పడుతున్నారు. ఆ బియ్యాన్ని ఆకర్షణీయమైన బ్రాండెడ్ పేర్లతో మార్కెట్లో కిలో రూ.80 నుండి రూ.100 వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. తూకంలో తేడాలు వస్తున్నాయని కొనుగోలుదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సివిల్ సప్లయ్స్ విజిలెన్స్ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.
:అధికారుల మెరుపు దాడులు – కుంభకోణం రట్టు
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సివిల్ సప్లయ్స్ విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించి ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని తనిఖీలు వేగవంతం చేశారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Post Views: 4









