సంగారెడ్డి ,నిలువుటద్దం ప్రతినిధి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, ప్రధాన జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి జి. భవాని చంద్ర కంది కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, న్యాయ సహాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య, జైలు అధికారి సంతోష్ రాయ్, న్యాయ సహాయ న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 15









