E-PAPER

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 12 October 2026, 10:41 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం

రూ.71.40 లక్షల విలువైన 142.8 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్‌.. రెండు కార్లు సీజ్‌

కంది| నిలువుటద్దం ప్రతినిధి, అక్టోబర్‌ 12:

సంగారెడ్డి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కంది ఎక్స్‌ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.71.40 లక్షల విలువైన 142.8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్‌ చేసి, గంజాయి తరలింపునకు ఉపయోగించిన రెండు కార్లను సీజ్‌ చేశారు.

జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎస్‌-న్యాబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు, సంగారెడ్డి రూరల్‌ సీఐ నయీముద్దీన్‌, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, సీసీఎస్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌, సంగారెడ్డి టౌన్‌ ఎస్‌ఐ వెంకటేశం సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న హ్యుందాయ్‌ ఎక్సెంట్‌, మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ కార్లను తనిఖీ చేయగా, హ్యుందాయ్‌ ఎక్సెంట్‌ కారులో 35 ప్యాకెట్లలో తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన రోషన్‌ కర్జీ (26), బిబుధ రాజ్తా (22)లను అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ నంబర్‌ 588/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ సాగు, రవాణా, సరఫరా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే ఎస్‌-న్యాబ్‌ నంబర్‌ 8712656777కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ అభినందించారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!