కూకట్పల్లి నిలువుటద్దం ప్రతినిధి :
మోతీనగర్ హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి హఠాన్మరణం పట్ల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అంజిరెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన కృష్ణారావు, శ్రావణ్ కుమార్ అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంజిరెడ్డి మృతి మోతీనగర్ ప్రాంతానికి, హౌసింగ్ సొసైటీకి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
Post Views: 3









