గుంతకల్ ఆర్డీవోకు బీజేపీ నాయకుల వినతి
గుంతకల్, సెప్టెంబర్ 21 ,నిలువుటద్దం:
2026 ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు నష్టపోయిన నేపథ్యంలో గుంతకల్ ప్రాంతాన్ని కరువు ప్రభావిత మండలంగా శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అధికారికంగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ నాయకులు సోమవారం ఆర్డీవో శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.పంట నష్టపోయిన రైతులకు అవుట్‌పుట్ సబ్సిడీతో పాటు అన్ని విధాలా ప్రభుత్వ సహాయం అందించాలని వారు కోరారు. దీనిపై ఆర్డీవో శ్రీనివాసులు స్పందిస్తూ, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జనతా వారధి కన్వీనర్ జీలకర్ర విక్రమ్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు, ఎఫ్‌సీఐ స్టేట్ డైరెక్టర్ వనగుంది విజయలక్ష్మి, జిల్లా ఎన్నికల కన్వీనర్ గుర్రం సూర్యనారాయణ, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగంశెట్టి విశ్వనాథ్, పాత గుంతకల్ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, మహిళా మోర్చా నాయకురాలు లక్ష్మి, కిసాన్ మోర్చా నాయకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.









