సంగారెడ్డి సెప్టెంబర్ 21 నిలువుటద్దం ప్రతినిధి:
51 శాతం ఫిట్మెంట్ ప్రకటించి వెంటనే వేతన సవరణ చేపట్టాలని, 6 డీలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బిల్లులన్ని తక్షణమే చెల్లించాలని, పూర్వ ప్రాథమిక పాఠశాలలలో ఇన్స్ ట్రక్టర్, ఆయాలను వెంటనే నియమించాలి, ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయుల సర్దుబాటు తొందరగా చేయాలని, హైదరాబాద్ జీఎచ్ ఎంసి పరిధిలో కలిసి ప్రాంతాలకు 24 శాతం ఇంటి అద్దె పెంపదల ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ అధ్యక్షతన సంగారెడ్డిలోని ఉపాధ్యాయ భవన్ లో జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యం. సోమశేఖర్, అనుముల రాంచందర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాథమిక పాఠశాలలలో ప్రారంభించిన ప్రి ప్రైమరీలలో ఇప్పటి వరకు సిబ్బందిని నియమించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రి ప్రైమరీలతో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల నమోదు పెరుగుతుందనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 132 ప్రి ప్రైమరీలను మంజూరు చేసింది. నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి, మార్గదర్శకాల ప్రకారం మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా విడుదల చేసినప్పటికీ, 3 నెలలు గడుస్తున్నా సిబ్బంది నియామకం జరుగలేదు.రాజకీయ జోక్యం కారణంగా సిబ్బంది నియామకం జరగక ప్రి ప్రైమరీలు నిర్వహణ ఇబ్బందిగా మారింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రి ప్రైమరీలలో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ సంకల్పం నెరవేరింది, కానీ సిబ్బంది లేక చేరిన పిల్లలు తిరిగి వెళ్లిపోతున్నరు. రాజకీయ కారణంగా చేరిన పిల్లలు వెళ్లిపోవడం శోచనీయం.హైదరాబాద్ జిఎచ్ ఎంసి పరిధిలో పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, గుమ్మడిదల, జిన్నారం మండలాలలోని కొన్ని ప్రాంతాలకు 24 శాతం ఇంటి అద్దె పెంచవలసియుంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్ కాజ్ గిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో 24 శాతం ఇంటి అద్దె ఉత్తర్వులు జారీచేసి ఉద్యోగులకు అమలు చేస్తున్నారు. కేవలం సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇంటవరకు ఉత్తర్వులు వెలువడలేదు.బడులు ప్రారంభమైన వెంటనే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి. మండల పరిధిలో సర్దుబాటు చేసినప్పటికీ, హై స్కూళ్లలో మాత్రం ఇంతవరకు చేయలేదు, ఫలితంగా బోధన కుంటుపడుతుంది. సర్దుబాటు ఆలస్యమైతే ఫలితాల మీద ప్రభావం చూపుతుంది. వెంటనే సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించి, బోధనకు సహకరించాలి.వెంటనే పీఆర్సీ అమలు చేయాలని, డీఎలు మంజూరు చేయాలని, పెండింగ్ బిల్లులన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రి ప్రైమరీలలో సిబ్బంది నియామకం, 24% ఇంటి అద్దె, ఉపాధ్యాయుల సర్దుబాటు వెంటనే పరిష్కారించాలని జిల్లా అధికారులను టీపీటీఫ్ కోరుతుంది. లేని పక్షంలో సమస్యల పరిష్కారం కోసం 26 నాడు నిరసన నిర్వహిస్తామని టీపీటీఫ్ జిల్లా కమిటీ తెలిపింది.ఈ సమావేశంలోజిల్లా అధ్యక్షులు సోమశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్, రాష్ట్ర కౌన్సిలర్లు రాజా రెడ్డి, జీవన్ రావ్, ఉపాధ్యక్షులు మల్లికార్జున్, విజయభాస్కర్, నాసర్ పటేల్, జిల్లా కార్యదర్శి జగన్నాథం, లక్ష్మణ్ లు మొదలగువారు పాల్గొన్నారు.









