ఎల్బీనగర్ ,నిలువుటద్దం ప్రతినిధి ;ఎన్రెడ్డినగర్ డివిజన్ వైదేహినగర్కు చెందిన కృష్ణప్రసాద్ ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని సంప్రదించారు. స్పందించిన ఎమ్మెల్యే.. చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా దరఖాస్తు చేయించారు. దీంతో రూ.2 లక్షల విలువైన ఎల్ఓసీ (LOC) మంజూరు కాగా, దానికి సంబంధించిన చెక్కును కృష్ణప్రసాద్ భార్య నీరజకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలవడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పేద కుటుంబాలకు సహాయం చేసే అవకాశం లభించిందన్నారు. కృష్ణప్రసాద్ భార్య నీరజ మాట్లాడుతూ తన భర్త ఆరోగ్య సమస్యపై ప్రత్యేక చొరవ తీసుకుని చికిత్స కోసం ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయాన్ని జీవితాంతం మరువలేమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఛాతిరి మధుసాగర్ తదితరులు పాల్గొన్నారు.









