తెలంగాణ బ్యూరో, నిలువుటద్దం
తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీలు హక్కులను అమలు పరచడం లేదని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు అధిక శాతం రాబోవు ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ముందుకు రావాలని బీసీల పట్ల నిబద్ధత చూపించాలని బీసీలకు జరుగుతున్న అన్యాయాలకు న్యాయం చేయాలని అన్నారు. దేశంలో అధిక శాతం బీసీ జనాభా ఉన్నందున బీసీలకు అధిక శాతం సీట్లు కేటాయిస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కష్టం ఒకడిది పెత్తనం ఇంకొకడిది అన్నట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి. బీసీ బిడ్డల ఇళ్లల్లోకి చొరబడి చూడండి బిసి బిడ్డల అష్ట కష్టాలేంటో మీ కళ్లారా చూడవచ్చు. ఇకపై బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. ఓట్ల కోసం అయితే బీసీ ప్రజలు ఉన్నారు కానీ అర్హత ఉన్న పరిపాలన కోసం బీసీ నాయకులు లేరు. మా నాయకత్వం మాకు కావాలి మా హక్కులు మేము సాధించుకోవాలి. మా బీసీ ప్రజలకు న్యాయం జరగాలి. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లు పెట్టి జనాభా ప్రాతిపదికను 50 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల బీసీ పాల్గొన్నారు.









