హైదరాబాద్,నిలువుటద్దం ప్రతినిధి:
కష్టపడి పనిచేస్తూ నాణ్యమైన సేవలు అందిస్తున్న మన క్యాటరింగ్ సంస్థలు గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రత్యేక గుర్తింపు పొందడం అభినందనీయమని గదె శివ అన్నారు.
కూకట్పల్లి బాలాజీనగర్‌కు చెందిన జ్యోతిర్మయి క్యాటరింగ్స్ అధినేత బలుసు సుధీర్, గోపాలనగర్‌కు చెందిన బాలాజీ క్యాటరింగ్స్ అధినేత బాలాజీ క్యాటరింగ్ రంగంలో తమ సేవలతో మంచి పేరు సంపాదించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేకంగా జ్యోతిర్మయి క్యాటరింగ్స్ నాణ్యత, రుచికరమైన వంటకాలు, సేవా ప్రమాణాలతో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారుల కార్యక్రమాలకు సేవలు అందిస్తూ గుర్తింపు పొందుతోందన్నారు. పోలీసు శాఖ అధికారిక కార్యక్రమాలకు సైతం క్యాటరింగ్ సేవలు అందించడం సంస్థ సేవా ప్రమాణాలకు నిదర్శనమని తెలిపారు.
వ్యాపారంతో పాటు సామాజిక సేవలోనూ బలుసు సుధీర్ ముందుంటారని గదె శివ అన్నారు. ఎన్టీఆర్ జయంతి, పుట్టినరోజులు, పండుగలు, ఆలయ అన్నప్రసాద కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారని కొనియాడారు.
“కష్టేఫలి” అనే సూత్రంతో ముందుకు సాగుతున్న జ్యోతిర్మయి క్యాటరింగ్స్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, బలుసు సుధీర్ మరియు ఆయన బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.









