రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా పాట ఆవిష్కరణ
ఫిల్మ్ న్యూస్, నిలువుటద్దం :
‘కాళంకి భైరవుడు’ చిత్రంలోని మూడో సింగిల్ టైటిల్ సాంగ్‌ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విడుదల చేశారు. రాజశేఖర్ వర్మ హీరోగా, పూజా కిరణ్, రితికా చక్రబోతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిహరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాట విడుదలతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.ఈ చిత్రానికి సంగీతాన్ని పెద్దపల్లి రోహిత్ (పి.ఆర్) అందిస్తుండగా, అశోక్ అన్నిబోయిన సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కిషోర్ ఎడిటింగ్, బీ. జగన్ ఆర్ట్ విభాగాలను నిర్వహిస్తున్నారు. రామ్ సుంకర ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.

కేఎన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శోభన్ నవరాసుల కో-డైరెక్టర్‌గా, పల్లపు రాజు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దర్శకత్వ విభాగంలో బుడుగు శ్రీనివాస్, రమ్య యార్లపాటి, బాబు తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.మూడో సింగిల్ టైటిల్ సాంగ్‌ను మంచు మనోజ్ విడుదల చేయడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు ముందే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.








