E-PAPER

తెలంగాణ, ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో ‘సర్’ గడువు పొడిగింపు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 30 October 2026, 10:08 am Posted by : ADDAMTELUGUDAILYNEWS

తెలంగాణ, ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో ‘సర్’ గడువు పొడిగింపు

తెలంగాణ ,నిలువుటద్దం ప్రతినిధి ;

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, నాగాలాండ్ వంటి ఆరు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును పొడిగించింది. ఆయా రాష్ట్రాల, ప్రధాన ఎన్నికల అధికారుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్​ను ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితాను నవంబరు 30న ప్రచురిస్తారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌పై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో దిల్లీకి మాత్రం ఈ గడువును డిసెంబర్ 12 వరకు పొడిగించారు. డిసెంబర్ 12 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఓటర్ల తుది జాబితాను డిసెంబర్ 22న విడుదల చేస్తారు.

అయితే తెలంగాణలో సర్ ప్రక్రియకు సంబంధించి అభ్యంతరాలు, ఫిర్యాదులకు నవంబర్‌ 26 వరకు అవకాశం ఉంది. ఓటర్ లిస్ట్​లో పేరు లేని వాళ్లు, వివరాలల్లో పొరపాట్లు ఉన్నవాళ్లు లేదా ఇతర అభ్యంతరాలు వచ్చే నెల 26 దాకా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను మాత్రం నవబంర్ 30న ప్రకటించనున్నారు.

తాజా షెడ్యూల్ ఇదీ

ఆంధ్రప్రదేశ్ - నవంబర్ 20
హరియాణా - నవంబర్ 20
నాగాలాండ్ - నవంబర్ 25
మహారాష్ట్ర - నవంబర్ 25
తెలంగాణ - నవంబర్ 26
దిల్లీ - డిసెంబర్ 15

కాగా, దిల్లీలో ఫిర్యాదులు, అభ్యంతరాలు సమర్పించే గడువును అక్టోబర్ 30 నుంచి నవంబర్ 25 వరకు పొడిగించారు. వాటి పరిష్కారానికి నవంబర్ 30 వరకు ఉన్న గడువును డిసెంబర్ 12కు మార్చారు. ఓటర్ల తుది జాబితాను డిసెంబర్ 22న ప్రచురిస్తారు.

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల జాబితాల్లో పారదర్శకతను పెంచడం, అర్హులైన పౌరలకు ఓటు హక్కు కల్పించడం, అనర్హులు లేదా డూప్లికేట్లను గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఎస్​ఐఆర్ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే బిహార్, బంగాల్, తమిళనాడు, కేరళం, ఉత్తర్​ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం మూడో దశలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, నాగాలాండ్, దిల్లీల్లో ఈ ఏడాది మే 14న ఎస్​ఐఆర్ ప్రారంభమైంది. ఈ దశ పూర్తయితే జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లద్ధాఖ్ మినహా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ పూర్తైనట్లు అవుతుంది

Generating image…

  • ఆంధ్రప్రదేశ్ – నవంబర్ 20
  • హరియాణా – నవంబర్ 20
  • నాగాలాండ్ – నవంబర్ 25
  • మహారాష్ట్ర – నవంబర్ 25
  • తెలంగాణ – నవంబర్ 26
  • దిల్లీ – డిసెంబర్ 15

    కాగా, దిల్లీలో ఫిర్యాదులు, అభ్యంతరాలు సమర్పించే గడువును అక్టోబర్ 30 నుంచి నవంబర్ 25 వరకు పొడిగించారు. వాటి పరిష్కారానికి నవంబర్ 30 వరకు ఉన్న గడువును డిసెంబర్ 12కు మార్చారు. ఓటర్ల తుది జాబితాను డిసెంబర్ 22న ప్రచురిస్తారు.

    దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల జాబితాల్లో పారదర్శకతను పెంచడం, అర్హులైన పౌరలకు ఓటు హక్కు కల్పించడం, అనర్హులు లేదా డూప్లికేట్లను గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఎస్​ఐఆర్ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే బిహార్, బంగాల్, తమిళనాడు, కేరళం, ఉత్తర్​ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం మూడో దశలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, నాగాలాండ్, దిల్లీల్లో ఈ ఏడాది మే 14న ఎస్​ఐఆర్ ప్రారంభమైంది. ఈ దశ పూర్తయితే జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లద్ధాఖ్ మినహా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ పూర్తైనట్లు అవుతుంది

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!