శంకర్పల్లి, నిలువుటద్దం , సెప్టెంబర్ 18:
శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు.


అనంతరం శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నదానాన్ని స్వీకరించారు. వేడుకలను విజయవంతం చేయడంలో యూత్ అసోసియేషన్ సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు.
Post Views: 46









