E-PAPER

అన్‌-మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసులు.. అర్హులైన ఓటర్లను తొలగించం ఎస్ ఐ ఆర్ సర్వే ప్రక్రియను పరిశీలించిన దొడ్ల వెంకటేష్ గౌడ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 18 September 2026, 9:10 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

అన్‌-మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసులు.. అర్హులైన ఓటర్లను తొలగించం ఎస్ ఐ ఆర్ సర్వే ప్రక్రియను పరిశీలించిన దొడ్ల వెంకటేష్ గౌడ్

నోటీసులు అందుకున్న ఓటర్లు ధ్రువపత్రాలతో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి
కూకట్‌పల్లి నిలువుటద్దం ప్రతినిధి :
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్ ) లో భాగంగా 2002 నాటి ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసి, వారి వివరాలను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు దత్తాత్రయ కాలనీలోని సాయిబాబా టెంపుల్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆయన, అన్‌-మ్యాపింగ్‌ కేటగిరీలో ఉన్న ఓటర్లకు బూత్ లెవల్ అధికారులు ( బి ఎల్ ఓ లు) నోటీసులు అందజేసి, సంబంధిత వివరాలను అధికారిక యాప్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 2002 ఓటరు జాబితాతో తమ వివరాలు మ్యాపింగ్ కాకపోయినంత మాత్రాన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు సంబంధించిన అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత కేంద్రానికి హాజరై, అధికారులకు వివరాలు సమర్పించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఓటర్లు నేరుగా కేంద్రానికి వచ్చి పత్రాలు సమర్పించడంతో పాటు, నోటీసులో సూచించిన విధంగా అవసరమైన ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా కూడా అప్లోడ్‌ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. నోటీసు అంటే ఓటు తొలగింపు కాదు నోటీసు అందినంత మాత్రాన ఓటు తొలగించినట్లు కాదని వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను పరిశీలించి, పాత ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేయడానికే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. అర్హత కలిగిన ఏ ఓటరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని ఆయన భరోసా ఇచ్చారు.ఓటర్లు ఎటువంటి అపోహలకు గురికాకుండా, తమకు అందిన నోటీసును పూర్తిగా పరిశీలించి, అందులో పేర్కొన్న ధ్రువపత్రాలతో నిర్ణీత సమయంలో సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి అర్హుడి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా అధికారులు, బి ఎల్ ఓ లు, బి ఎల్ ఏ లు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ప్రజలు కూడా SIR సర్వే ప్రక్రియకు సహకరించి, తమ ఓటరు వివరాల్లో ఏమైనా మార్పులు, పొరపాట్లు లేదా మ్యాపింగ్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సి.ఓ. ముస్తఫా, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!