పటాన్చెరు, సెప్టెంబర్ 18 (నిలువుటద్దం న్యూస్):
భారతీనగర్ డివిజన్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి డివిజన్ పరిధిలోని పలు గణేష్ మండపాలను సందర్శించి విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఓల్డ్ ఎంఐజీ కాలనీలోని లంబోదర యూత్, మన గణేష్ యూత్ అసోసియేషన్, నవభారత్, ఎఫ్ పార్క్, నేతాజీ కమ్యూనిటీ హాల్, వివేకానంద పార్క్ గణేష్ మండపాలను ఆమె సందర్శించారు. అనంతరం బీహెచ్ఈఎల్ టౌన్షిప్, బాంబే కాలనీలోని వీఆర్యు(వ)సేన గణేష్ మండపం, రామచంద్రాపురంలోని మల్లికార్జున్ నగర్ గణేష్ మండపాలను సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువతతో కలిసి సింధు ఆదర్శ్ రెడ్డి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తున్న యువతను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ ముదిరాజ్, రాకేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.









