E-PAPER

6 నెలల్లో ఖైరతాబాద్​కు ఉప ఎన్నిక!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 19 September 2026, 4:16 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

6 నెలల్లో ఖైరతాబాద్​కు ఉప ఎన్నిక!

ఖైరతాబాద్​ ,సెప్టెంబర్ 19 , నిలువుటద్దం ప్రతినిధి ;

తెలంగాణ హైకోర్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన ఆయన, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించారు. అంతేకాకుండా 2024 మార్చి 17న సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఫిరాయింపుల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది.

అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా నేరుగా ఉప ఎన్నిక బరిలో దిగుతానని దానం నాగేందర్ స్పష్టం చేయడం విశేషం. గతంలోనూ ఆయనకు ఉప ఎన్నికల అనుభవం ఉంది. 2004లో ఆసిఫ్‌నగర్ స్థానం నుంచి టీడీపీ తరఫున గెలుపొంది, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన చరిత్ర ఆయనకుంది. నాటి రాజకీయ పరిస్థితులకు, నేటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, హైకమాండ్ ఆయనకు మళ్లీ టికెట్ కేటాయిస్తుందా లేక ప్రత్యామ్నాయ అభ్యర్థిని చూస్తుందా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఇటీవల జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీకి ఈ స్థానాన్ని నిలుపుకోవడం కత్తి మీద సాము లాంటిదే. ఒకవేళ దానం నాగేందర్‌కు కాకుండా వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ అధిష్టానం మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దానం నాగేందర్‌ను ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలపై కూడా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!