E-PAPER

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాల విద్యార్థి, నిరుద్యోగ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 21 September 2026, 8:23 am Posted by : ADDAMTELUGUDAILYNEWS

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాల విద్యార్థి, నిరుద్యోగ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

సంగారెడ్డి సెప్టెంబర్ 20 నిలువుటద్దం: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాల స్టూడెంట్స్ జేఏసీ నాయకులు తలారి సురేష్, కరుణాకర్, సోషల్ మీడియా ఇన్‌చార్జి పురుషోత్తం ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించనున్న మాల విద్యార్థి, నిరుద్యోగ మహాసభ పోస్టర్‌ను జిల్లా మాల జాతి సలహాదారు అనంతయ్య, ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు, మాల మహానాడు అధ్యక్షులు అందోల్ మల్లేశం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మాల విద్యార్థి జేఏసీ చైర్మన్ పండుగ భాను తేజ మాట్లాడుతూ, అక్టోబర్ 4వ తేదీన ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న మాల విద్యార్థి, నిరుద్యోగ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజాసంఘాలు మరియు మాల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం అమలులోకి వచ్చిన అనంతరం మాల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు, నిరుద్యోగులు మరియు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభలో ప్రధానంగా చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రిజర్వేషన్ అవకాశాలు, ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానం, విద్యా మరియు ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటివరకు వెలువడిన 25 నోటిఫికేషన్లలో రోస్టర్ విధానం కారణంగా మాల వర్గానికి అన్యాయం జరిగిందని నిర్వాహకులు ఆరోపించారు. సుమారు 19 నోటిఫికేషన్లలో ఒక్క పోస్టు కూడా కేటాయించకుండా ‘జీరో’ చూపించారని పేర్కొంటూ, ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, నియామకాల్లో సామాజిక న్యాయం మరియు రిజర్వేషన్ హక్కులు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ మహాసభకు ప్రొ. హరగోపాల్, కంచె ఐలయ్య, ప్రొ. కోదండరాం, ప్రొ. లింబాద్రి, గంటా చక్రపాణి, మల్లేపల్లి లక్ష్మయ్య తదితర ప్రముఖులు, మేధావులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, నిరుద్యోగులు, ఉద్యోగులు మరియు మాల సంఘాల నాయకులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు మరియు సామాజిక న్యాయాన్ని కోరుకునే అన్ని వర్గాల ప్రజలు ఈ మహాసభలో పాల్గొని తమ సమస్యలను చర్చా వేదికపై ప్రస్తావించాలని పండుగ భాను తేజ కోరారు. హక్కులు, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్న ఈ మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నందాకిషోర్, రవీందర్ టీచర్, పుందరికం, మధుసూదన్, స్వతంత్రం, రాములు, సాధానందం, ఆత్మబంధవ్ ప్రేమ్ రాజ్, అరవింద్, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!