హైదరాబాద్ సెప్టెంబర్ 21 , నిలువుటద్దం ప్రతినిధి: రాష్ట్రంలో 35 రోజులుగా కొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలకు ప్రభుత్వం స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో పాలిటెక్నిక్ కళాశాలలు సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగనున్నాయి.

విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్ నేతృత్వంలో చేపట్టిన ధర్నాలు, నిరసనలు, అధ్యాపకుల సహాయ నిరాకరణతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ పేర్కొంది. ఏఐసీటీఈ నిబంధనలు, సిలబస్, పరీక్షల విధానం కూడా యథాతథంగా కొనసాగనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, అధ్యాపక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Post Views: 7









