E-PAPER

విద్యార్థుల కలలకు రెక్కలు..ప్రతిభకు పట్టం.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
7032740231
addamtelugudailynews.com
Date of Publish : 1 October 2026, 9:00 pm Posted by : ADDAMTELUGUDAILYNEWS

విద్యార్థుల కలలకు రెక్కలు..ప్రతిభకు పట్టం.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 26వ స్నాతకోత్సవం ఘనంగా
1,721 డిగ్రీలు ప్రదానం.. 300 పీహెచ్‌డీలు.. 178 పతకాలు
ఐదుగురు యువ అధ్యాపకులకు 2026 ఛాన్సలర్ అవార్డులు.

హైదరాబాద్ నిలువుటద్దం బ్యూరో ఇంచార్జ్ ::::

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 26వ స్నాతకోత్సవం అక్టోబర్ 1న హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ జె. అనురాధ, తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ చీఫ్ రెక్టర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా తదితరులు కార్యక్రమానికి హాజరై పట్టభద్రులకు అభినందనలు తెలిపారు.
విద్యార్థుల విద్యా ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలిచిన ఈ స్నాతకోత్సవంలో వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులకు మొత్తం 1,721 డిగ్రీలను ప్రదానం చేశారు. ఇందులో 300 పీహెచ్‌డీ డిగ్రీలు ఉన్నాయి. అత్యుత్తమ విద్యా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 178 పతకాలను అందజేశారు. తెలంగాణ గవర్నర్, చీఫ్ రెక్టర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్య అతిథి డాక్టర్ సమీర్ వి. కామత్ పతకాలను ప్రదానం చేశారు.
ఐదుగురు యువ అధ్యాపకులకు ఛాన్సలర్ అవార్డులు
విశ్వవిద్యాలయ అభివృద్ధికి పరిశోధన, బోధన, విద్యార్థుల మార్గదర్శకత్వం తదితర రంగాల్లో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2026 ఛాన్సలర్ అవార్డులను ఐదుగురు యువ అధ్యాపకులకు ప్రకటించారు.
అవార్డులు అందుకున్న వారిలో స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీకి చెందిన డాక్టర్ టి. శరవణన్, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, ప్లాంట్ సైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ జోగి మధుప్రకాశ్, స్కూల్ ఆఫ్ ఫిజిక్స్‌కు చెందిన డాక్టర్ రామచంద్రరావు యల్లా, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, పొలిటికల్ సైన్స్ విభాగానికి చెందిన డాక్టర్ అనఘా ఇంగోలే, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్‌కు చెందిన డాక్టర్ నరేష్ అన్నెం ఉన్నారు.
విద్యార్థులు సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలి: ఛాన్సలర్
ఈ సందర్భంగా ఛాన్సలర్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి పట్టభద్రులను అభినందిస్తూ, వారు సాధించిన విజయాలు పట్టుదల, కృషికి నిదర్శనమని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యా ప్రమాణాలు, పరిశోధన, ఆవిష్కరణలు, అంతర్జాతీయ గుర్తింపు, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లో సాధిస్తున్న పురోగతిని ఆయన ప్రస్తావించారు.
పరిశోధనా ప్రాజెక్టులు, పేటెంట్లు, స్టార్టప్ కార్యక్రమాల ద్వారా జాతీయ అభివృద్ధికి విశ్వవిద్యాలయం అందిస్తున్న సహకారం పెరుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడూ ఆసక్తిని కొనసాగిస్తూ, సానుభూతితో నాయకత్వం వహించాలని, సమానత్వం మరియు సమగ్రతను పాటించాలని సూచించారు. ప్రపంచ సవాళ్లను పరిష్కరించేందుకు తమ విద్యను బాధ్యతాయుతంగా వినియోగించాలని, నిజాయితీ, మానవత్వం, కరుణను జీవితంలో నిలుపుకోవాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో కొనసాగుతున్న ప్రస్థానం
వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ జె. అనురాధ 2025–26 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీ సాధించిన ప్రగతిని వివరించారు. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ 851–900 బ్యాండ్‌లో తన స్థానాన్ని కొనసాగించిందని తెలిపారు. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో 200 స్థానాలు మెరుగుపడి 2027కు 801–1000 బ్యాండ్‌కు చేరిందని వెల్లడించారు.
విషయాల వారీగా కూడా యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. లింగ్విస్టిక్స్ 151–200, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ 251–300, సోషియాలజీ 251–300, పొలిటికల్ సైన్స్ 301–400, కెమిస్ట్రీ 401–450, ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్ 501–550, బయోలాజికల్ సైన్సెస్ 651–700 బ్యాండ్లలో నిలిచినట్లు ఆమె తెలిపారు.
₹184 కోట్లకు పైగా విలువైన పరిశోధనా ప్రాజెక్టులు
విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 179 క్రియాశీల పరిశోధనా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, వాటి విలువ ₹184 కోట్లకు పైగా ఉందని వైస్‌చాన్స్‌లర్ తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా ఉదహరించబడుతున్న టాప్ 2 శాతం పరిశోధకుల్లో యూనివర్సిటీకి చెందిన 34 మంది అధ్యాపకులు గుర్తింపు పొందారని చెప్పారు. ఇద్దరు అధ్యాపకులు జె.సి. బోస్ నేషనల్ ఫెలోషిప్ అందుకున్నారని వెల్లడించారు.
₹100 కోట్ల విలువైన ANRF-PAIR కార్యక్రమం ద్వారా ఆరు సంస్థలు, సుమారు 180 మంది పరిశోధకులతో కలిసి ఆరోగ్య రంగం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు సంబంధించిన సవాళ్లపై పరిశోధనలు చేపడుతున్నట్లు తెలిపారు. ASPIRE కార్యక్రమం ద్వారా 140కి పైగా డీప్‌టెక్ స్టార్టప్‌లకు మద్దతు అందించినట్లు పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయంలో ఇన్ఫోర్మ్ ఏర్పాటు, దృష్టి లోపం ఉన్న 100 మందికి స్మార్ట్ విజన్ గ్లాసెస్ పంపిణీ, ఇంటర్‌డిసిప్లినరీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కార్యక్రమం కింద క్యాంపస్ సదుపాయాల అభివృద్ధి, 43 మంది అంతర్జాతీయ స్కాలర్ల రాక, ఎరాస్మస్ ముండస్ జాయింట్ మాస్టర్స్ గ్రాంట్, NEP-2020 కింద నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్ కెమిస్ట్రీ ప్రోగ్రామ్ ప్రారంభం వంటి అంశాలను ఆమె వివరించారు.
2026–27 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ సీట్లలో 92.43 శాతం, పీజీ సీట్లలో 83.85 శాతం, అండర్‌గ్రాడ్యుయేట్ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ సీట్లలో 85.64 శాతం భర్తీ అయినట్లు తెలిపారు.
“విద్య నిరంతర ప్రయాణం”
ముఖ్య అతిథి డాక్టర్ సమీర్ వి. కామత్ పట్టభద్రులను అభినందిస్తూ, విద్యార్థులు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. తమకు నచ్చిన రంగాల్లో అవకాశాలను అన్వేషిస్తూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని అన్నారు.
డీఆర్‌డీవోలో తన అనుభవాలను ప్రస్తావించిన ఆయన, సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకారం, పట్టుదల, అనుకూలత అవసరమని చెప్పారు. “విద్య అనేది జీవితాంతం కొనసాగే ప్రయాణం” అని పేర్కొన్నారు. విజయానికి ఒకే ఒక మాయాజాల సూత్రం లేదని, తమకు ఆసక్తి ఉన్న రంగంలో కృషి చేయడం ద్వారా ప్రతిభను వెలికితీయవచ్చని సూచించారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో డీఆర్‌డీవోకు ఉన్న దీర్ఘకాలిక సహకారాన్ని, ముఖ్యంగా DRDO ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ అఫ్ ఎక్స్ల్లెన్స్ ద్వారా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని ఆయన ప్రస్తావించారు.
వినయంతో, బాధ్యతతో ముందుకు సాగాలి: గవర్నర్
తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ చీఫ్ రెక్టర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, విద్యార్థులు తమ విద్య, నైపుణ్యాలను సమాజం మరియు దేశానికి ఉపయోగపడేలా వినియోగించాలని సూచించారు.
విద్య కేవలం డిగ్రీలు, ఉద్యోగాలు, వృత్తిపరమైన విజయాలతో మాత్రమే పరిమితం కాదని, వ్యక్తిత్వం, విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనలోనే నిజమైన విద్య ప్రతిబింబిస్తుందని అన్నారు. ఎంతటి విజయాలు సాధించినా వినయాన్ని కోల్పోకూడదని సూచించారు.
తమ విద్యా ప్రయాణంలో తోడ్పడిన ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సేవలను గుర్తుంచుకోవాలని, నిజాయితీతో, విశాల దృక్పథంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని పట్టభద్రులకు సూచించారు. తమ జ్ఞానాన్ని సమాజం, దేశ శ్రేయస్సు కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు.
అత్యుత్తమ పరిశోధనలకు ప్రత్యేక పతకాలు
స్నాతకోత్సవంలో పలు ప్రతిష్టాత్మక పతకాలను కూడా ప్రదానం చేశారు. డాక్టర్ నందివాడ రత్నశ్రీ మెడల్ ఫర్ బెస్ట్ పీహెచ్‌డీ థీసిస్ ఇన్ ఆస్ట్రోఫిజిక్స్/థియరిటికల్ ఫిజిక్స్ను దిలీప్ కుమార్ అందుకున్నారు.
ప్రొఫెసర్ ఎన్. శివకుమార్ మెడల్ ఫర్ బెస్ట్ పీహెచ్‌డీ థీసిస్ ఇన్ లైఫ్ సైన్సెస్ను శ్రేయా పి.కె. అందుకున్నారు. రాజ్ నరహరి పెర్షాద్ మెడల్ ఫర్ బెస్ట్ పీహెచ్‌డీ థీసిస్ ఇన్ సంస్కృత స్టడీస్ను అమృత విలాస్ బర్బాదికర్ అందుకున్నారు.
సరోజినీ నాయుడు మెమోరియల్ ట్రస్ట్ మెడల్, సి.టి. ఇంద్ర ఎండోమెంట్ మెడల్తో పాటు ఎస్సీ/ఎస్టీ మెడల్ను డొరోథీ డియెంగ్డోహ్ అందుకున్నారు.
విద్యా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న పట్టభద్రుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ 26వ స్నాతకోత్సవం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధిస్తున్న పురోగతికి మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

Generating image…

Recent News :

Addham Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!