కూకట్‌పల్లి (నిలువుటద్దం ప్రతినిధి):
“అధికార పదవులు ఉన్నవారు ఎందరో ఉంటారు.. కానీ ఆపదలో ఉన్న పేదవాడికి అండగా నిలిచే గుణం కొందరికే సొంతం.” ఇచ్చిన మాటతో మభ్యపెట్టే రాజకీయ నాయకుల నడుమ, చేతిలో ఎలాంటి పదవి లేకపోయినా ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తూ ప్రజల మదిలో దేవుడిగా నిలుస్తున్నారు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు (జివిఆర్) అన్న.
అన్యాయంపై సమరభేరి – పేదలకు కొండంత అభయం:
కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఏ పేదవాడికి కష్టం వచ్చినా, టైమ్‌తో సంబంధం లేకుండా అర్ధరాత్రి అయినా సరే స్పందించే ఏకైక నాయకుడు జివిఆర్ అన్న. అన్యాయాన్ని అరికట్టడంలో ఆయన చూపించే ధైర్యం, తెగువ నిజమైన ‘మొనగాడిలా’ అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతోంది. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్న ఆయన తీరుకు కూకట్‌పల్లి ప్రజలు ఫిదా అవుతున్నారు.
పదవి లేకున్నా ప్రవాహంలా సేవలు:
“ఒక్క హోదా, పదవి లేకపోతేనే ఈ స్థాయిలో నిరుపేదలకు సాయమందిస్తూ అండగా నిలబడుతున్నారు.. ఇక అధికారికంగా పదవి చేతికి వస్తే కూకట్‌పల్లి రూపురేఖలే మారిపోతాయి!” అని స్థానిక ప్రజలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అండగా నిలిచే నాయకుడు దొరికితే ఆ నియోజకవర్గానికే అదృష్టమని, అలాంటి ఆపద్బాంధవుడు తమకు లభించడం కూకట్‌పల్లి చేసుకున్న పుణ్యమని ప్రజలు వేనోళ్ల కొనియాడుతున్నారు.









